కిరణ్ ఫోజులు కొడుతున్నారు, వైయస్ దోపిడీయే: బాబు

Chandrababu Naidu
గుంటూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోజులు కొడుతున్నారని, ఆయన ఒళ్లంతా అహమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడారు. ప్రజల వద్దకు కాంగ్రెస్ నాయకులు నేరుగా వెళితే చెయ్యి విరగ్గొట్టి పంపడం ఖాయమన్నారు. ఆ భయంతోనే సహకార సంఘాల ఎన్నికల్లో పరోక్ష పద్ధతుల్లో గట్టెక్కిందని ధ్వజమెత్తారు.

కిరణ్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి దోపిడీని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన 6.8 కిలోమీటర్లు నడిచి, వేమూరు చేరుకున్నారు. అక్కడ ఉన్న స్టేషన్‌లోకి వెళ్లారు. డిఎస్‌పి, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కిరణ్‌కు ఒళ్లంతా అహమేనని, ప్రజాసంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోడని, అంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడతారన్నారు.

వైయస్ ప్రారంభించిన దోపిడీని ప్రతి ఫైలులోనూ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నుంచి వలస పోతున్న నేతలంతా ఆయారామ్ గయారామ్‌లని పేర్కొన్నారు. వారంతా తొలుత తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారని, ఇప్పుడు వాళ్లకు అమ్ముడుపోతున్నారని, ఇది చూస్తే చాలా బాధేస్తోందన్నారు. పార్టీ గుర్తుతో గెలిచి ఫిరాయిస్తే సభ్యత్వం రద్దవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం లేకుండా చేస్తూ బరితెగించి పరోక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతోందని ధ్వజమెత్తారు.

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే పద్ధతిన నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. మొండిచెయ్యితో నేరుగా ప్రజల వద్దకు వెళితే విరగ్గొడతారని తెలిసి దొంగ ముసుగేసుకొని వస్తోందన్నారు. సహకార ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు, తెరాస గల్లంతు అయ్యాయని, టిడిపి గెలిచే స్థానాల్లో స్టేలతో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు. అందరూ కలిసి హస్తాన్ని చితక్కొట్టి నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+