అమీర్‌తో డేవిడ్ హల్‌చల్: చపాతి కాలుస్తూ...(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జానకీదేవి మెమోరియల్ కళాశాల విద్యార్థినులు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌తో మంగళవారం ముచ్చటించారు. సాయంత్రం మూడు గంటల సమయంలో మధ్య ఢిల్లీలోని ఆ కళాశాలకు డేవిడ్, అమీర్‌లు వెళ్లారు. భారత సమాజంలో మహిళల సాధికారత గురించి వారిద్దరు కళాశాల విద్యార్థినులతో మాట్లాడారు. వారు దాదాపు 45 నిమిషాల పాటు విద్యార్థినులతో మాట్లాడారు.
డేవిడ్, అమీర్‌లు విద్యార్థినులతో కలుపుగోలుగా ఉన్నారు. ఇటీవల ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. దానిపై యావద్భారతదేశం స్పందించింది. ఢిల్లీలో మహిళా, విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. మహిళల సమానత్వం కోసం అందరూ పోరాడారు. ఇలాంటి సమయంలో అమీర్, కామెరూన్‌లు ఢిల్లీలోని జానకీ దేవి మెమోరియల్ మహిళా కళాశాలకు రావడం గమనార్హం.

జానకీ దేవి మెమోరియల్ కళాశాలకు వస్తున్న కామెరూన్, అమీర్

న్యూఢిల్లీలోని జానకీ దేవీ మెమోరియల్ కళాశాలలో అమ్మాయిలతో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. అమ్మాయిలకు షేక్ హ్యాండ్

అమ్మాయిలతో మాట్లాడుతున్న కామెరూన్, అమీర్

మహిళా సాధికారతపై మాట్లాడుతూ నిబ్బరంగా ఉండాలని చెబుతున్న అమీర్.. కామెరూన్ నవ్వు

మహిళా క్యాబ్ డ్రైవర్లతో కామెరూన్, అమీర్

ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో ప్రధాని మన్మోహన్‌తో బ్రిటన్ ప్రధాని

రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కామెరూన్

సోనియా గాంధీతో కామెరూన్

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద కామెరూన్

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద..

స్వర్ణదేవాలయంలోని వంటశాలలో చపాతీని కాల్చుతున్న డేవిడ్ కామెరూన్
గతేడాది డిసెంబరులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. అదే సమయంలో మగవాడి ఆలోచనలో మార్పు రావాలని కూడా చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో కామెరూన్, అమీర్ రావడంతో వారి మధ్య ఎక్కువ వరకు మహిళలకు సంబంధించిన అంశాలే చర్చకు వచ్చాయి. పితృస్వామ్య ఆలోచనల సమాజాన్ని అమీర్ ఖాన్ తప్పు పట్టారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశలో ఆలోచించాలని అమీర్ అన్నారు. మొదట మనం పుట్టిన ఆడపిల్లలను చంపడం మానుకోవాలని హితవు పలికారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications