• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందూ టెర్రరిజం: షిండే సారీ! ఆలస్యమైంది ఐనా సరే!

By Srinivas
|
Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హిందూ ఉగ్రవాదం, అగస్టా కుంభకోణం తదితర అంశాలు కుదిపేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో సమావేశాల్లో ఈ అంశం చెలరేగకుండా ఉండేందుకు హిందూ ఉగ్రవాదంపై షిండే వెనక్కి తగ్గారు. సుదీర్ఘ పార్లమెంటు సమావేశాలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం ఈ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. హిందూ ఉగ్రవాదంపై షిండే సారీ చెప్పడంతో బిజెపి కొంత శాంతించినా.. అగస్టా స్కాం, ద్రవ్యోల్బణం తదితరాలపై శరాలను ఎక్కుపెట్టాలని నిర్ణయించింది. దీనిని గుర్తించే ప్రతిపక్షాలతో కాంగ్రెస్ కాళ్లబేరానికి వచ్చింది. హిందూ ఉగ్రవాదంపై కేంద్ర హోం మంత్రి షిండే గతంలో చేసిన ప్రకటనను సమావేశాలకు ఒకరోజు ముందు ఉపసంహరించుకున్నారు.

సంఘ్ పరివార్ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్నది తన ఉద్దేశమే కాదని తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఏ మతానికి ఉగ్రవాద రంగు పులిమేందుకు ప్రయత్నించలేదన్నారు. బుధవారం లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా లోక్‌సభాపక్ష నేత, హోం మంత్రి షిండే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రతిపక్షాలు అడిగిన అన్ని డిమాండ్లకు దాదాపు అంగీకరించారు.

అగస్టా కుంభకోణానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిపి) డిమాండ్‌కైనా తాము సిద్ధమేనని కమల్ నాథ్ చెప్పారు. అలాగే, హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌కు వివరణ ఇచ్చేందుకు ఇదే సమావేశంలో షిండే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను హామీ ఇచ్చిన విధంగా సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. కాగా అఖిలపక్ష సమావేశం తర్వాత స్పీకర్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, బాసుదేవ ఆచార్య, నామా నాగేశ్వరరావు తదితరులను సాదరంగా పలకరించి, బడ్జెట్, బిల్లులను సజావుగా ఆమోదించేందుకు సహకరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
On the eve of the crucial Budget session, giving in to pressure from principal opposition party BJP for his alleged statement blaming the BJP and RSS for training terrorists, home minister Sushil Kumar Shinde “regretted” that he had been misunderstood and he had not meant to link terrorism to any religion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more