హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది! నిత్యం జన సమ్మర్ధంగా ఉండే కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందగా.. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. అయితే, నిందితులు మొదట దిల్‌సుఖ్ నగర్‌లోని సాయిబాబా గుడి వద్దనే పెట్టాలని భావించారట.

గురువారం కాబట్టి సాయి గుడి వద్ద బ్లాస్ట్ చేస్తే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని మొదట భావించారట. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. భారీగా భక్తులు ఉంటారనే కారణంతో మొదట గుడిని టార్గెట్ చేసుకున్నప్పటికీ నగర కమిషనర్ అనురాగ్ శర్మ గుడికి రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఉగ్రవాదులు తమ టార్గెట్‌ను థియేటర్‌ల వైపుకు ఆఖరి నిమిషంలో మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ఉగ్రవాదుల టార్గెట్‌లో అనురాగ్ శర్మ కూడా ఉన్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. పేలుళ్ల ఘటనకు పది నిమిషాల ముందు అనురాగ్ శర్మ గుడి నుండి వెళ్లిపోయారు. ఆయన సాయిబాబు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతతో గుడి నుండి థియేటర్‌లకు లక్ష్యం మారినట్లుగా అనుమానిస్తున్నారు.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

అఫ్జల్ గురు, కసబ్‌ల ఉరికి ప్రతీకారంగా ఇది జరిగిందని భావిస్తున్నారు.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

కసబ్‌ను ఉరితీసినప్పుడే ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

గురువారం కావడంతో దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా గుడిని టార్గెట్‌గా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

అనురాగ్ శర్మ బాబా గుడికి వచ్చి పూజలు చేయడంతో ఉగ్రవాదుల టార్గెట్ మారినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సిపి కూడా ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

గుడి నుండి రద్దీగా ఉండే కోణార్క్, వెంకటాద్రి థియేటర్ ప్రాంతం వైపు టార్గెట్ మారినట్లుగా భావిస్తున్నారు.

గుడి నుండి టార్గెట్ ఛేంజ్? ఉరికి ప్రతీకారమా?(పిక్చర్స్)

పదకొండేళ్ల క్రితం సాయిబాబు ఆలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు.

మరోవైపు పార్లమెంటు దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు, ముంబయి దాడి కేసుల నిందితుడు అజ్మల్ కసబ్‌లకు ఉరిశిక్షను అమలు చేసినందుకు ప్రతికారచర్యగా ఇది జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్జల్, కసబ్‌ల ఉరిశిక్షకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థలు అప్పుడే హెచ్చరించాయి.

English summary
Five minutes before the deadly bomb blast, Hyderabad City police commissioner Anurag Sharma performed puja at the famous Sai Baba temple in Dilsukhnagar. The temple is about 500 meters away from the blast scene. Doubts are being raised in police circles on whether the terrorists wanted to plant the bombs in the temple initially?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X