హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లపై నిరసన దీక్ష: యువతే ఎదుర్కోగలదని బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ఉగ్రవాదాన్ని యువతనే సమర్థవంతంగా ఎదుర్కోగలదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లపై యువజన కాంగ్రెసు అధ్యక్షుడు వంశీ చంద్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బొత్స పాల్గొని మాట్లాడారు. బాంబు పేలుళ్ల ఘటనపై నగరమంతా ఒక్కటై నిలిచి సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. ఉగ్రవాదాన్ని యువతనే సమర్థవంతంగా ఎదుర్కోగలదని చెప్పారు. బాంబు పేలుళ్ల ఘటన జరిగిన వెంటనే యువజన కాంగ్రెసు స్పందించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన తన వంతు కృషి చేసిందని, ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతోందని, వారి కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

భవిష్యత్తులో ప్రజలను చైతన్యవంతం చేసే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన యువజన కాంగ్రెసు నేతలను కోరారు. బాంబు పేలుళ్ల అనంతరం నగరానికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తీవ్రవాదులను హెచ్చరించారన్నారు.

తమకు ప్రజల రక్షణ ముఖ్యమని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. దివంగత రాజీవ్ గాంధీ, ఇందిర గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, దేశ సామరస్యం కాపాడటమే కాంగ్రెసు పార్టీ ప్రధాన లక్ష్యమని బొత్స సత్యనారాయణ చెప్పారు. మృతులకు బొత్స, వంశీ తదితరులు నివాళులు అర్పించారు.

English summary

 State Youth Congress president Vamshi Chand Reddy calls fast today to show solidarity with blast victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X