హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చి 18న రాష్ట్ర బడ్జెట్, 13 నుంచి అసెంబ్లీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్చి 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రతిపాదించనున్నారు. ఈసారి ఆయన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. మార్చి 13వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13 నుంచి 22 వరకు సమావేశాలు జరగనున్నాయి.

22వ తేదీ సాయంత్రం నుంచి సమావేశాలు వాయిదా పడనున్నాయి. తిరిగి ఏప్రిల్ 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి స్థాయి సంఘం పద్దులపై చర్చలు జరుపుతాయి. ఏప్రిల్ 23వ తేదీ నవరకు ఈ చర్చలు సాగుతాయి. 23వ తేదీన తిరిగి శాసనసభ సమావేశమవుతుంది. ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ చర్చలు జరుగుతాయి. మే 2న బడ్జెట్ ఆమోదం పొందనుంది.

శాసనసభ బడ్జెట్ సమావేశాల కోసం ముఖ్యమంత్రి, శానససభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, గవర్నర్ ఆమోదం కోరామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆయన చెప్పారు. మే 2వ తేదీననే శాసనసభ వాయిదా పడుతుంది.

వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకున్నట్లు, ఆ ప్రతిపాదనలతో బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. బడ్జెట్ రూపకల్పన కోసం ఆనం రామనారాయణ రెడ్డి వివిధ శాఖల అధికారులతో చర్చలు కూడా చేశారు.

English summary
Assembly Budget Session will begin from March 13. The Finance Minister Anam Ramanarayana Reddy will propose the vote on account budget on March 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X