హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయప్రద కౌంటర్ జగన్‌కి కాదా?: మురళీ మోహన్‌పై సై!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada-Murali Mohan
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె చేస్తున్న ప్రకటనలు ఆ దిశలోనే కనిపిస్తున్నాయి. ఆమె జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఎప్పుడో నిర్ణయించుకున్నారనే వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే, మరోసారి ఆమె పాదయాత్రలపై సోమవారం స్పందించారు. ఆమె కామెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనే చేశారని అంటున్నారు.

ప్రస్తుతం వస్తున్నా మీకోసం పేరిట చంద్రబాబు నాయుడు, మరో ప్రజా ప్రస్థానం పేరిట జగన్ సోదరి షర్మిలలు పాదయాత్రలు చేస్తున్నారు. ఆమె పాదయాత్రలు రాజకీయ లబ్ధి కోసమేనని ఇప్పటికి రెండుసార్లు విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు షర్మిలకు కాకుండా బాబుకు మాత్రమే తగిలేలా ఉన్నాయని అంటున్నారు. పాదయాత్ర అని చెప్పినప్పటికీ పరోక్షంగా బాబునే ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.

ఎందుకంటే ఆమె దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కితాబిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు మేలు జరిగిందని, ఆయన పాలనను ప్రజలు మనసుల్లో నుంచి వేరు చేయలేమని వ్యాఖ్యానించారు. తద్వారా ఆమె పాదయాత్ర కామెంట్స్ షర్మిలకు కాకుండా బాబుకు తగిలేలా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పైన పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి నుండి టిడిపి తరఫున మురళీ మోహన్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు!

తెలంగాణ పైనా ఆమె ఇప్పటికి రెండుమూడు సార్లు స్పందించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సమైక్యాంధ్రకే తన మద్దతు అని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వలె తెలంగాణ విషయంలో ఆ భారాన్ని జయప్రద కూడా కేంద్రం పైనే మోపుతున్నారు.

English summary
Uttar Pradesh MP Jayaprada may contest from Murali Mohan in next General elections from Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X