నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది తాజాగా నిందితుల పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఇద్దరు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు 8 రోజుల్లో ఈ హత్య కేసును ఛేదించారు.
ఘాతుకానికి పాల్పడిన పదవ తరగతి విద్యార్థులు
రూప రెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్లో చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడడం అందరినీ షాక్ కి గురి చేసింది. పూల్ సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన ఇద్దరు పదహారేళ్ల విద్యార్థులు స్కూల్ వసతి గృహం లోనే ఉంటూ చదువుకుంటున్నారు. సెల్ ఫోన్ వాడడం, వ్యసనాలకు బానిసలుగా మారడం వంటి కారణాలతో, ఆ విద్యార్థుల ప్రవర్తనను గుర్తించిన ప్రిన్సిపల్ రూప రెడ్డి తల్లిదండ్రులను పిలిపించింది.

టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? నెట్ లో సెర్చ్ చేసిన విద్యార్థులు
వారి సమక్షంలో ఇద్దరు విద్యార్థులను కఠినంగా మందలించారు. దీంతో ఆమె పైన కక్ష పెంచుకున్న విద్యార్థులు ఆమె ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని కూడా ఆలోచించి హత్య చేయాలని పథకం రూపొందించారు. దీనికోసం టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? వంటి అనేక పద్ధతులను వారి పరిశోధన చేసినట్టు తెలుస్తోంది.
భర్త ఇంట్లో లేని రోజు హత్యకి ప్లాన్
రూప రెడ్డిని హత్య చేయాలని భావించిన వారు దానిని ఆమె భర్త ఇంట్లో లేని రోజు అమలు చేయడానికి ప్లాన్ చేశారు. రూపారెడ్డి కుమారుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండడంతో రూపా రెడ్డి దంపతులు తరచు హైదరాబాద్ కు వెళుతుంటారు. ఈనెల ఎనిమిదో తారీకు నుండి వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో రూప రెడ్డి ఆమె భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లి ఉన్నారు.
హత్యకు విద్యార్థుల ప్రిపరేషన్ ఇలా
అయితే మళ్లీ పాఠశాల పున ప్రారంభం కావడంతో రూప రెడ్డి తిరిగి ఈనెల 11వ తేదీన కొండమల్లేపల్లికి వచ్చారు. స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన రూప రెడ్డి ఒంటరిగా ఉన్నట్టు గుర్తించిన విద్యార్థులు వారు అనుకున్న పథకాన్ని అమలు చేయడానికి అదే సరైన సమయంగా భావించారు. అప్పటికే వారు హత్య కోసం ఒక టీ షర్టు, హుడి, ప్యాంటు, మాస్కులు కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు.
ఒకరు రెక్కీ, మరొకరు ఘాతుకం
రూప రెడ్డి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద పిల్యా తండాకు చెందిన విద్యార్థి కాపలా ఉండగా, ఇంకో విద్యార్థి ఇంటి వెనుక భాగం నుంచి లోనికి ప్రవేశించాడు. ఆ విద్యార్థిని రూప రెడ్డి గుర్తించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పైన 27 సార్లు దాడి చేసి హత్య చేశాడు. రెండున్నర లక్షల నగదు తీసుకొని గోడ దూకి బయటకు వచ్చాడు.
రూపా రెడ్డిని చంపిన తర్వాత చేసిందిదే
స్నేహితులతో కలిసి రూపా రెడ్డి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలోని బండరాయి కింద పెట్టాడు.ఇద్దరు కొంత దూరం వెళ్లిన తర్వాత హుడీని డ్రైనేజీలో పడేసాడు. ఆ తర్వాత రోజు హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. రూప రెడ్డి ని హత్య చేసిన తర్వాత ఒకరు 2.10 లక్షలు మరొకరు 40,000 తీసుకుని వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు.
ఏపీ తెలియనట్టుగా రూపా రెడ్డి డెడ్ బాడీని చూడటానికి వచ్చిన విద్యార్థులు
మరుసటి రోజు తమకు ఏమీ తెలియదు అన్నట్టుగా రూపా రెడ్డి మృతదేహాన్ని చూడడానికి వచ్చారు. ఇద్దరిలో ఒక విద్యార్థి ఖరీదైన సెల్ఫోన్ కొన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా నిన్న ఉదయం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఆధారాలను సేకరించి, సమాచారాన్ని రాబడుతున్నారు.













Click it and Unblock the Notifications