డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు..!!

డీలిమిటేషన్ వ్యవహారం లో కీలక పరిణామం. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ఊహించని మలుపు తీసుకుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్ వ్యవహారం పైన కాంగ్రెస్ తమ వైఖరి తేల్చి చెప్పింది. మహిళా రిజర్వేషన్లు మాత్రం అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ తాజా నిర్ణయంతో... మోదీ- షా ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీంతో.. అసలు 2029 నాటికి డీలిమిటేషన్ సాధ్యమా అనే సందేహం మొదలైంది.

డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న 543కే స్తంభింపజేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీడబ్ల్యూసీ డిమాండ్‌ చేసింది. ఈ సీట్లలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించి, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయాలని పేర్కొంది. జనగణనలో భాగంగా కులగణన జరుపుతామన్న హామీని కచ్చితంగా అమలుపరచాలని, తెలంగాణ, బిహార్‌లలో జరిగినట్టుగా కులగణన జరపాలని సూచించింది. విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా 800 నగరాల్లో భారీ సభలను నిర్వహించాలని, అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల చోరీపై ఉద్యమించాలనే కీలక తీర్మానాలను ఆమోదించింది. మహిళా రిజర్వేషన్లతో పాటుగానే డీలిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా కేంద్రం కీలక వ్యూహ రచన చేసింది.

ఏపీకి రైల్వే మరో భారీ వరం, తమిళనాడు రూటు లో ఇక - కష్టాలకు చెక్..!!
ఏపీకి రైల్వే మరో భారీ వరం, తమిళనాడు రూటు లో ఇక - కష్టాలకు చెక్..!!
congress-working-committee-demands-25-year-freeze-on-lok-sabha-seats-at-543-here-the-details

కాంగ్రెస్ తాజా నిర్ణయంతో

డీలిమిటేషన్ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే ప్రతిపాదించాలని భావించినా.. పరిస్థితులు అనుకూలించ లేదు. టీఎంసీ, ఆప్, ఎన్సీపీ మద్దతుతో బిల్లులను ఆమోదం పొందేలా చేయాలని ప్రయత్నించారు. అయితే, ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలతో లెక్కలు మారాయి. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ మారుతున్న లెక్కలతో మరింత పట్టు బిగిస్తోంది. వచ్చే 25 సంవత్సరాల వరకూ లోక్‌సభ సీట్లను స్తంభింపచేయాలని, 2023లో పార్లమెంట్‌ ఆమోదించిన విధంగా మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని, లోక్‌సభలో ఉన్న 543 స్థానాల్లోనే మహిళలకు కోటా కల్పించాలని తీర్మానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీక్‌, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సీడబ్ల్యూసీ వివరంగా చర్చించింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో 'ఛాత్రోంకి ఘూంజ్‌' పేరిట విద్యార్థుల సభలను నిర్వహించాలని... వీటిలో రాహుల్‌గాంధీ పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక.. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో డీలిమిటేషన్ 2029 ఎన్నికల నాటికి సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+