దంపతులపై దాడి, గోల్డ్ చోరీ: ప్రమాదంలో 4గురు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
గంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రెండు లారీలు పరస్పరం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కాటేదాన్‌లో అగ్నిప్రమాదం
నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. శోభాప్లాస్టిక్ కంపెనీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేయడానికి యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలోని సీలేరు దగ్గర సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications