వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంటిమెంట్ దాటి: బాబు యాత్రపై హ్యాపీ, వారి తోడుతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna - Jr Ntr
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నరు. తెలంగాణలో సెంటిమెంట్, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో పాటు పార్టీ వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించిందని కానీ, బాబు పాదయాత్ర తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

చంద్రబాబు 150 రోజులుగా చేస్తున్న పాదయాత్ర చూపుతున్న ప్రభావంపై ప్రజల్లో బాగా ఉందని పార్టీ భావిస్తోంది. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే తర్వాత పరిస్థితి చాలా మెరుగైందని, పార్టీ వాణి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి పాదయాత్ర ఒక బలమైన సాధనంగా ఉపయోగపడిందన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. వంద రోజులతో ఆయన పాదయాత్ర ఆపేస్తే బాగుండేదన్న పార్టీ సీనియర్లు కూడా ఇప్పుడు కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు.

గతేడాది అక్టోబర్ 2న మొదలుపెట్టి చంద్రబాబు ఇప్పటిదాకా రాయలసీమలోని రెండు జిల్లాలు, తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, కోస్తాలో రెండు జిల్లాల్లో పర్యటించారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన వంద రోజుల తర్వాత వచ్చిన సహకార ఎన్నికల్లో ఐదారు జిల్లాల్లో పార్టీ మంచి పనితీరు కనపర్చింది. రెండు జిల్లాల బ్యాంకులను కైవసం చేసుకొంది.

బాబు పాదయాత్ర పార్టీలో కొత్త ఊపు తీసుకు వచ్చిందని నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా ఉంటే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. బాబుకు తోడు బాలకృష్ణ, నారా లోకేష్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు జాయిన్ అవుతుండటంతో ఇక తిరుగులేదని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సాధ్యమైనంత వరకు దీనిని సాగదీసి ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. దాదాపు ఈ ఏడాదంతా ఆయన ప్రజల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Telugudesam Party cadre is very happy with party chief Nara Chandrababu Naidu's Vastunne Meekosam Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X