వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ: సోనియా వద్దకు క్యూ, కెవిపి ఇంటివద్ద కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: శాసనసభ్యుల కోటా శాసనమండలి ఎన్నికల అంశం న్యూఢిల్లీకి చేరుకుంటోంది. ఓ వైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు వేర్వేరు లిస్టుతో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా మరోవైపు ఎమ్మెల్సీ ఆశావహులు పలువురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని తమకు అవకాశం కల్పించాలని అధిష్టానం పెద్దల వద్దకు వరుస కడుతున్నారు.

పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఒక్కో స్థానానికీ ముగ్గురి పేర్లతో జాబితా ఇవ్వాల్సిందిగా అధిష్ఠానం కిరణ్, బొత్సలను ఆదేశించింది. శుక్రవారం సోనియా, ఆజాద్‌లతో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో ఆశావహులు సోనియాని ప్రసన్నం చేసుకునేందుకు రాజధానిలో మకాం వేశారు.

ఎమ్మెల్యే, నామినేటెడ్ కోటాల నుంచి 9 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కే అవకాశముంది. వీటికోసం దాదాపు ముప్పాతిక మందికి పైగా ఆశావహులు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద సోనియా కోసం బారులు తీరారు. వారిలో కొందరు సీనియర్ నేతలను సోనియా కలుసుకున్నారు. కానీ, ఇంకా పెద్దసంఖ్యలో నేతలు రావడంతో ఆశ్చర్యపోయి స్వయంగా బయటకు వచ్చి వారి నుంచి వినతిపత్రాలు అందుకుని పంపేశారు.

మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కంతేటి సత్యనారాయణ రాజు, కమలాకర్ రావు, పివి రాజేశ్వర రావు, పరిగి రామిరెడ్డి, కనుకుల జనార్దన్ రెడ్డి, మజ్జి శారద, కందుల దుర్గేశ్ తదితరులు సోనియాను కలుసుకున్నారు. మాజీ మంత్రులు గాదె వెంకట రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపి రాజయ్య కూడా సోనియాకు తమ లిస్టును అందించారు. సోనియా నివాసంతో పాటు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపిలు కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, వి హనుమంతరావు నివాసాల్లోనూ ఆశావహుల సందడి కనిపిస్తోంది.

ఢిల్లీకి చెందిన ప్రతి సీనియర్ నేత వద్దా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ ఆశావహులు కనిపించారు. రాహుల్ గాంధీ కనపడితే ఆయన వెంట పరుగులు తీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై బొత్స, కిరణ్‌లతో గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహుల పేర్ల జాబితాతో ఢిల్లీకి రావాల్సిందిగా ఆజాద్ వారిని కోరారు. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియాతో ఆజాద్, కిరణ్, బొత్స సమావేశమై తుది జాబితాను ఖరారు చేసే అవకాశముంది.

English summary
There is already considerable name-pushing in Delhi. Over 100 Congress leaders are camping there to meet high command leaders to press their cases. Former ministers J.C. Diwakar Reddy, Gade Venkata Reddy and Paladugu Venkata Rao are trying to get a ticket for their former colleague Kanteti Satyanarayana Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X