ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందని లవర్‌పై బ్లేడుతో దాడి

ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయమయింది. ఆమె ఆ గాయంతోనే పరీక్షకు హాజరయింది. అయితే, ఆమెపై బ్లేడుతో దాడికి దిగిన అగంతకుడు ఆమెను ప్రేమించిన యువకుడే అని చెబుతున్నారు. ఆ విద్యార్థిని తమ మధ్య ఉన్న ప్రేమను తన తల్లిదండ్రులతో చెప్పిందని, అందుకే ఆమెపై అతడు దాడి చేశాడని చెబుతున్నారు.
గంజాయి పట్టివేత
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న అరవై నాలుగు కిలోల గంజాయిని జిఆర్‌పి పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి దార్యప్తు చేపట్టారు.
బ్యాంకులో చోరీ యత్నం
జిల్లాలోని గంట్యాడ మండలం బోనంగి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీకి దుండగులు తీవ్రంగా యత్నించారు. బ్యాంకు తాళాలు పగుల గొట్టి చోరీకి యత్నించారు. గురువారం ఉదయం బ్యాంకు వచ్చిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!