వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్ కట్: కిరణ్‌కి మంత్రుల షాక్, దానం వర్సెస్ బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - DL Ravindra Reddy - C Ramachandraiah
హైదరాబాద్‌: పరీక్షల సమయంలో విద్యుత్తు కోతపై గురువారంనాడు రాష్ట్ర మంత్రివర్గంలో తీవ్రమైన చర్చ జరిగింది. విద్యుత్తు కోతంపై సీనియర్ మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సి. రామచంద్రయ్య, జానా రెడ్డి తదితరులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు. విద్యుత్తు కోతపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతతో రైతాంగం, పరిశ్రమలు ఇబ్బందులు పడుతుంటే, సర్ చార్జీలు, ఇతరత్రా భారాలు మోపి మరింత కష్టాలు పాలు చేస్తున్నామంటూ వారు విమర్శించారు.

వారి ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో నెలకున్న విద్యుత్‌ కోతలను అధిగమించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, దీంతోపాటు పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నా మని, గత నెలలో కూడా రూ. 300 కోట్లు విద్యుత్‌ శాఖకు విడుదల చేశామని ఆయన చెప్పారు. నిధుల విడుదలతో సమస్య పరిష్కారం కాదని మంత్రి రామచంద్రయ్యతో పాటు పలువురు సీనియర్‌ మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దీనిపై మంత్రుల ఉప సంఘం దృష్టిసారిస్తోందని, విద్యుత్‌ సమస్యలను అధిగమించే విధంగా ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో వివరించినట్లు తెలిసింది. అంతకు ముందు, హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు, ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించిన తీరు, తదుపరి అంశాలపైనా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశంలో వివరించారు.

బొత్స వర్సెస్ దానం

హైదరాబాదు మెట్రో రైలు వ్యవహారంపై మంత్రులు బొత్స సత్యనారాయణకు, దానం నాగేందర్‌కు మధ్య తీవ్ర వివాదం జరిగింది.హైదరాబాద్‌ మెట్రో రైలు బాధితులకు భూమికి బదులు భూమి ఇవ్వాల్సిందేనని నగర మంత్రి దానం నాగేందర్‌ మంత్రి వర్గ సమావేశంలో డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ ధీటుగా స్పందించారు. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదని, భూపరిహారం ఎంతమందికి ఇస్తామని మంత్రులు బొత్స దానం నాగేందర్‌ను ప్రశ్నించారు. దీనిపై డీఎల్‌ మాట్లాడుతూ భూసేకరణ చట్టం మేరకు పరిహారం వర్తింప చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.

అవుటర్ రింగ్‌ రోడ్డు బాధితులకు భూపరిహారం వర్తింప చేశామని, మెట్రో రైలు బాధితులకు కూడా అదే విధంగా ఆదుకోవాలని దానం ముఖ్యమంత్రికి విన్నపించారు. ఒక దశలో దానం వ్యాఖ్యలతో కేబినెట్‌ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం.

అనంతరం విశాఖ పట్నం ఒక ప్రైవేట్‌ కంపెనీకి కేటాయించిన భూములను అసెంబ్లీ కమిటీ నివేదిక మేరకు రద్దు చేయడంతో, సదరు ప్రతిపాదనను సీఎస్‌ కేబినెట్‌ అజెండాలో చేర్చారు. దీనిపై కొండ్రు మురళి భగ్గుమన్నడంతో బొత్స అది సరైన చర్యే, అసెంబ్లీ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని అన్నారు. దీంతో ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఆ కంపెనీకి కేటాయించిన భూములు రద్దు చేయడం సరికాదని తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సహకార ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కేబినెట్‌ సహచరులను ప్రత్యేకంగా అభినంధించారు. అదే విధంగా ఏప్రిల్‌ 3 వారం లేదా మే తొలి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని, సహకార ఎన్నికల మాదిరే సత్ఫలితాలు సాధించాలని, ఈమేరకు అవసరమైన కసరత్తును రూపొందించాలని మంత్రులకు సీఎం కిరణ్‌ మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది.

English summary

 Senior ministers like C Ramachandraiah, K Jana Reddy and DL Ravindra Reddy have questioned CM Kiran kumar Reddy on power cuts and power taarif hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X