ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ఇల్లు అమ్మారు, మీరూ అమ్మండి: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఏలూరు: వైయస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ఇల్లు అమ్ముకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా దారుణంగా సంపాదించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన 500 కోట్ల రూపాయల ముడుపుల గురించి, జగన్ అక్రమాస్తుల గురించి, తల్లి కాంగ్రెసుకు పిల్ల కాంగ్రెసు మద్దతుతో కేసులు మాఫీ వంటి విషయాల గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన పార్ట కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో జరిగిన భీమవరం, ఉండి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిరంజీవి ప్రజారాజ్యం లాగే కాంగ్రెసులో కలిసిపోతుందని ఆయన అన్నారు. చిరంజీవి సామాజిక న్యాయం పేరు చెప్పి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించుకున్నారని, ఆ తర్వాత కాంగ్రెసులో కలిసిపోయారని ఆయన అన్నారు. వైయస్ విజయమ్మకు రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు దొందూ దొందేనని, రెండు పార్టీలు కలిసి తమను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అవినీతిపరుడని, కెసిఆర్ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుపని చేశానని, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని ఆయన అన్నారు. అప్పుడూ కష్టపడ్డాని, ఇప్పుడు కూడా కష్టపడుతున్నానని, తనకు కష్టపడాల్సిన అవసరం లేదని, అయినా ప్రజల కోసం కష్టపడుతున్నానని ఆయన అన్నారు.

పార్టీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా ఫరవా లేదని, తమ పార్టీ వంద మంది నాయకులను తయారు చేయగలదని ఆయన అన్నారు. ఇది పార్టీ కార్యకర్తలకు ఎమర్జెన్సీ కాలమని, ఆస్తులు అమ్మి అియనా పార్టీని గెలిపించుకోవాల్సిన సమయమని ఆయన అన్నారు. నిద్రలో కూడా పార్టీ గురించే ఆలోచించాలని ఆయన అన్నారు. పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆయన అన్నారు.

ఇంటి పనులు మీ భార్యలకు అప్పగించి పార్టీ కోసం పాటు పడాలని, అస్తులు అమ్ముకోవాలని, ఎకరం ఉన్నా అమ్మి పార్టీ కోసం పనిచేయాలని, నెల రోజుల్లో 20 రోజులు ప్రజల్లో తిరగాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఆదుకుంటానని చంద్రబాబు కార్యకర్తలకు ఉద్బోధించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu has said that YS Rajasekhar Reddy has sold his house before 2004 Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X