రేవంత్‌ రెడ్డిపై శ్రీధర్ బాబు ఫైర్: ఎర్రబెల్లి సవాల్

Sridhar Babu
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. విద్యుత్తు సమస్యపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చులకనగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ కోసం అమలు చేస్తే, తాము మానవీయ ముఖంతో అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.శ్రీధర్ బాబుపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరగలేదని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాకు వస్తే అక్రమాలను తాను చూపిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

విద్యుత్ సంస్కరణలను తెచ్చింది తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని, వ్యవసాయానికి తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్తు అందించామని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్తు సమస్యపై వామపక్షాలు ఆందోళన చేస్తే, దాన్ని వాడుకుని కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. విద్యుత్ సంక్షోభానికి వైయస్ రాజశేఖర రెడ్డి కారకులని ఆయన ఆరోపించారు.

జలయజ్ఞంలో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలోనే పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ కోతలతో, చార్జీల పెంపుతో అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో హాలీడేల పర్వం కొనసాగుతోందని ఆయన అన్నారు. ప్రముఖ కవి కాళోజీ కవితతో రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తండ్రి ద్వారా సంపాదించుకుని ఆ డబ్బు ద్వారా పార్టీ పెట్టినవాళ్లను చూస్తున్నామని ఆయన అన్నారు.

ఈ ప్రభుత్వం తన కనుసన్నలతోనే నడుస్తుందని జగన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైయస్ రెక్కల కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని, 2014 వరకు కొనసాగనిస్తామని చెప్పారని ఆయన అన్నారు. వైయస్ మరణానికి కారణమైనవాళ్లను, జగన్ జైలుకు పోవడానికి కారణమైన వాళ్లను ఎందుకు కూలుస్తారో, ఎందుకు సమర్థిస్తారో తెలియడం లేదని ఆయన అన్నారు.

ప్రాంతాలుగా కలిసి ఉండాలి, ప్రజలుగా విడిపోవాలని వైయస్ ప్రయత్నించారని, ప్రజలుగా కలిసి ఉండి ప్రాంతాలుగా విడిపోదామని తాము అన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస సభ్యుడు ఈటెల రాజేందర్‌ను వైయస్ సభలో హెచ్చరికలు చేసే విధంగా మాట్లాడారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+