కేసుల నుంచి బయటపడ్డానికే: బాబుపై మైసురా

Mysoora Reddy
హైదరాబాద్: కేసుల నుంచి బయటపడడానికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎంవి మైసురా రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెసు తెలుగుదేశం పార్టీ అనేది నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు.

అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్షాలు నైతిక విజయం సాధించాయని ఆనయ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ విశ్వాసం వ్యక్తం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చంద్రబాబు మేనమామ అని తేలిపోయిందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షం తటస్థ వైఖరి అవలంబించడం ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందనేది రుజువైందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపిందని ఆయన అన్నారు. తమ పార్టీని విమర్శించడానికే తెలుగుదేశం పార్టీ చర్చను ఉపయోగించుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య గత రెండేళ్లుగా సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడు శానససభ సాక్షిగా అది నిరూపితమైందని అన్నారు. సభలో లేని వ్యక్తులను నిందించకూడదనే సభా నిబంధనలను కూడా టిడిపి సభ్యులు పాటించలేదని ఆయన అన్నారు. ఆ సమయంలో టిడిపి సభ్యుల మాటలకు అధికార పక్ష సభ్యులు మద్దతు తెలపడం చూస్తుంటే వారి కుమ్మక్కు స్పష్టమైందని అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు.

చార్జిషీట్ అనేది ఓ అభియోగ పత్రమని, దాన్ని కోర్టులో దాఖలు చేసిన తర్వాత కోర్టు విచారించి నిర్ధారిస్తుందని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను బయట ప్రస్తావించకూడదని, నిబంధనలు అతిక్రమించి చార్జిషీట్ విషయాలను ప్రస్తావిస్తుంటే ఉపసభాపతి సక్రమంగా అడ్డుకోలేదని, తెలిసి చేశారో తెలియక చేశారో అర్థం కావడం లేదని మైసురా రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+