టిడిపి, జగన్‌పార్టీ అసంతృప్తి: చేనేతని ప్రస్తావించని ఆనం

బడ్జెట్ ఈసురుమంటోందన్నారు. క్రమంగా ఆర్థిక అభివృద్ధి రేటు పడిపోతోందన్నారు. అప్పులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ద్రవ్యోల్భణానికి అనుగుణంగా బడ్జెట్ పెరగలేదన్నారు. క్రమంగా అప్పులు పెరిగి వృద్ధి రేటు తగ్గుతోందని, అలాంటప్పుడు ప్రజలు సంతోషంగా ఎలా ఉంటారని యనమల ప్రశ్నించారు.
ప్రచారం కోసమే రైతు బడ్జెట్ అంటూ ప్రభుత్వం మోసం చేసిందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వం మోసపూరిత విధానాలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినట్లు చెప్పారు. కొత్త విషయాలు ఏమీ చెప్పకుండా కేవలం కాగితాలపై లెక్కలు చూపించారన్నారు. ఖర్చులు, వ్యయానికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదన్నారు.
బడ్జెట్ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
చేనేతను ప్రస్తావించని ఆనం
ఈ రోజు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో చేనేత రంగాన్ని ప్రస్తావించలేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ఉంది. అలాంటి చేనేత రంగం ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తావించలేదు.
చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఊసేది
ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ ఓ అంకెల గారడి అని ఫ్యాప్సీ పేర్కొంది. బడ్జెట్‌లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఉసేదని ప్రశ్నించింది. బడ్జెట్‌లో పరిశ్రమలకు ప్రోత్సాహం ఏదన్నారు.












Click it and Unblock the Notifications