స్విస్ వనితపై గ్యాంగ్ రేప్ కేసు: ఐదుగురి అరెస్టు

వీరిని బాబా, భూతా, రాంప్రో, గజా అలియాస్ బ్రజేష్, విష్ణు కంజర్, నితిన్ కంజర్‌గా గుర్తించినట్లు తెలిపారు. సైకిళ్లపై సాహస యాత్రకు వచ్చిన ఈ దంపతులు రెండు రోజుల కిందట ఝాడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బసచేశారు. ఈ సందర్భంగా కొందరు దుండగులు వారిపై దాడిచేసి, పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధిత దంపతులు ప్రస్తుతం న్యూఢిల్లీ వెళ్లినట్లు డీఐజీ చెప్పారు. ఆరో నిందితుడు నితిన్ కుమార్ (24) అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులంతా ఝారియా గ్రామంలోని కంచర్ టోలా సెటిల్‌మెంట్‌కు చెందినవారు.
కాగా, ఇదో దురదృష్టకరమైన, దేశానికి మచ్చతెచ్చే సంఘటన అని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ గుప్తా అన్నారు. అయితే, తాము ఎక్కడెక్కడకు వెళ్లేదీ జిల్లా ఎస్పీకి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న నిబంధనను విదేశీ టూరిస్టులు పాటించడం లేదని ఆయన అన్నారు. దీనివల్ల వారి భద్రతను పర్యవేక్షించడం అసాధ్యమవుతున్నదని తెలిపారు.












Click it and Unblock the Notifications