కరుణానిధి బెదిరింపులు: చెన్నైకి కేంద్ర మంత్రులు

తమ సీనియర్ మంత్రులు ముగ్గురు కరుణానిధిని కలుస్తారని, కరుణానిధికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, కొన్ని సూచనలు చేస్తున్నారని, యుఎన్ ముందుకు వచ్చే ప్రతిపాదనలపై వాళ్లు కరుణానిధితో చర్చిస్తారని, కరుణానిధితో చర్చించిన తర్వాతనే ప్రతిపాదనలను ఎలా ముందు పెట్టాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణంయ తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళులు ప్రయోజనాలపై రాజీపడబోమని కరుణానిధికి చెప్పాలని, ఆ మేరకు ఆయనను ఒప్పించాలని ఆ ముగ్గురు మంత్రులకు కాంగ్రెసు నాయకత్వం సూచించినట్లు సమాచారం. చిదంబరం, ఆంటోనీలకు కరుణానిధితో మంచి సంబంధాలున్నాయి. కాగా, గులాం నబీ ఆజాద్ తమిళనాడు కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.
యుపిఎ నుంచి వైదొలుగుతామని కరుణానిధి శుక్రవారం హెచ్చరికలు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖలు కూడా రాశారు. ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాకపోవడం పట్ల కరుణానిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థితిలో ముగ్గురు మంత్రులను కరుణానిధితో చర్చలకు నియోగించారు.












Click it and Unblock the Notifications