మళ్లీ కింగ్‌లమే, నేనుండగా..!: కిరణ్ రెడ్డి, కెసిఆర్‌పై టిజి

ఎవరో ఒకరు భారం మోయాల్సిందే..
80 పైసలకు ఇస్తున్న విద్యుత్‌ను ప్రభుత్వం రూ.5కు కొంటోందన్నారు. ఇంకా అధిక భారం మేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. ఎవరో ఒకరు భారం మోయాల్సిందే అన్నారు. అయినా, ప్రజల పైన ప్రభుత్వం అనవసర భారం వేయడం లేదన్నారు. విద్యుత్ శాఖను తాను సమీక్షిస్తున్నానని, ఇంకా ప్రత్యేక మంత్రి ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏడు గంటల కంటే తక్కువ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
పెట్టుబడులపై...
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. గతంలో కేటాయించిన భూముల్లో నిర్దిష్ట సమయంలోగా పరిశ్రమలు ఏర్పాటు చేయని యాజమాన్యాల నుండి భూములు వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అక్కడ పెట్టుబడులకు ముందుకొస్తున్నారన్నారు.
రెండు టిఎంసిల కోసం పోరాడాలా?
బాబ్లీ ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే రెండు టిఎంసిల నీటి కోసం పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో 160 టిఎంసిల నీటి కోసం ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు.
అసెంబ్లీలో సిటిజన్ చాఫ్టర్ అమలు బిల్లును త్వరలో ప్రవేశ పెడతామన్నారు. సరైన సేవలు అందించని అధికారులకు జరిమానా విధించేలా చట్టం తీసుకు వస్తామన్నారు.
తెరాస కాకి లెక్కలు
తెలంగాణ వెనుకబడిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాకి లెక్కలు చెబుతున్నారని మంత్రి టిజి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబడిందని గారడి లెక్కలు చెప్పి యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా, సీమల కంటే తెలంగాణలోనే తలసరి ఆదాయం ఎక్కువ అన్నారు. యువతను పక్కదారి పట్టించే ప్రయత్నాలు సరికావన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే సడక్ బంద్ నిర్వహిస్తున్నారన్నారు. సడక్ బంద్ కారణంగా కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications