అడిగితే సాక్షి ద్వారా అబద్దాలు: జగన్‌పై బాబు ఫైర్

Chandrababu Naidu
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించావని జగన్‌ను అడిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమపై బురద చల్లుతున్నారని, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా అందరికీ ఉంటుందని, కాని జగన్ పత్రిక మాత్రం తాము ఏదైనా అడిగితే తమను లక్ష్యం చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆయన తప్పు పటటారు..

అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆయన విమర్శించారు. వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు బుధవారం జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించారు.

గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు చేపడతామని తెలిపారు. ఏలూరు, భీమిలిలలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ రహదారి 214ని నాలుగు లైన్లుగా మారుస్తామని ఆయన తెలిపారు. కొల్లేరును ఐదు కాంటూరు నుంచి మూడు కాంటూరు వరకు తగ్గిస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం నుంచి దవళేవశ్వరం వరకు గోదావరి వెంబడి మరో ప్రధాన కాలువ తవ్విస్తామని ఆయన వెల్లడించారు అసంఘటిత కార్మికుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ధవళేశ్వరం ఆనకట్టుకు మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. జిల్లాలో చేపల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+