వేటేయండి!: జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఆజాద్ సీరియస్

Ghulam Nabi Azad - YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేల పైన ఎలాంటి ఉపేక్ష వద్దని కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఆజాద్‌ను కలిశారు. గీత దాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికిన ఎమ్మెల్యేల విషయమై ఆయన ఆజాద్‌తో చర్చించారు.

అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించి మరీ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆజాద్‌తో చెప్పారు. వారిపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై ఆజాద్ కూడా సీరియస్‌గానే ఉన్నారు. జగన్‌కు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని ఉపేక్షించవద్దని, వారిపై వేటు వేయాలని బొత్సకు సూచించారు.

బొత్స సత్యనారాయణ హైదరాబాద్ బయలుదేరారు. ఆయన రాగానే సిఎల్పీ గీత దాటిన ఎమ్మెల్యేల పైన సభాపతి నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలో తొమ్మిది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

తొమ్మిది మందిపై వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆజాద్ పిసిసి చీఫ్‌కు సూచించారు. బొత్స కూడా ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేతలకు వేటు విషయమై సంకేతాలు పంపారట. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్‌ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+