కిరణ్‌పై నెగ్గిన బొత్స: జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు?

Kiran Kumar Reddy-Botsa Satyanarayana-YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులపై వేటు వేయించే విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నెగ్గినట్లే కనిపిస్తున్నారు. ఆయన గురువారం పార్టీ అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమై అందుకు అనుమతి పొందినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 9 మంది జగన్ వర్గం శానససభ్యులపై చర్యలు తీసుకోవాలని బుధవారం జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకే వీలైనంత త్వరగా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేయించి, ఉప ఎన్నికలను ఆహ్వానించాలని బొత్స సత్యనారాయణ భావించినట్లు సమాచారం. సహకార ఎన్నికల ఫలితాలకు సంబంధించిన క్రెడిట్‌ను కిరణ్ కుమార్ రెడ్డి కొట్టేశారు. జగన్ వర్గం శానససభ్యులపై వేటు వేయడం ద్వారా జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు విజయం సాధించకపోతే కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన ప్రభావం పడుతుందని బొత్స సత్యనారాయణ భావించినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వేటు వేసే చర్యలను ఇప్పుడే చేపట్టవద్దని భావించినట్లు చెబుతున్నారు. అనర్హత వేటు వేసే విషయంపై 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన ఇటీవల చెప్పారు.

కాగా, ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉత్సుకత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించకపోవడంతో వైయస్ జగన్ ప్రాబల్యం తగ్గుతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. జగన్ హవా తగ్గుతుందని కాంగ్రెసు పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు చెబుతున్నారు. తమ హవా తగ్గలేదని నిరూపించుకోవడానికి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని వైయస్ జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, జగన్ హవా ఏ మేరకు తగ్గిందనే విషయాన్ని సాధారణ ఎన్నికల లోపు నిర్ధారించుకోవడానికి ఉప ఎన్నికలు పనికి వస్తాయని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, జగన్ వర్గం శానససభ్యులపై వేటు వేయాలనే బొత్స సిఫార్సుకు గులాం నబీ ఆజాద్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాంగ్రెసుపై తిరుగుబాటు చేసి వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతుగా అవిశ్వాస తీర్మానాన్ని జోగి రమేష్, సుజయ కృష్ణరంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మద్దాలి రాజేష్, గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి, అళ్లనాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బలపరిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు అమర్నాథ్ రెడ్డి, వనిత, బాలనాగిరెడ్డి, అళ్ల నాని, ప్రవీణ్ రెడ్డి, సాయిరాజ్ జగన్‌కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+