స్టాలిన్‌పై సిబిఐ: 18 ప్రాంతాల్లో సోదాలు, 17కార్లు సీజ్

Stalin
చెన్నై: డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి తనయుడు, ఆ పార్టీ నేత స్టాలిన్ నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఈ రోజు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ డైరెక్టర్ గురువారం మాట్లాడారు. పద్దెనిమిది ప్రాంతాల్లో తాము సోదాలు నిర్వహించామని, 17 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూ.48 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వచ్చినట్లుగా తాము గుర్తించామని చెప్పారు. తమ సోదాలలో ప్రభుత్వ ప్రమేయం లేదని ప్రకటించారు.

స్టాలిన్ నివాసంలో సోదాల పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతకముందు స్పందించిన విషయం తెలిసిందే. స్టాలిన్ నివాసంలో సిబిఐ ఈ సమయంలో సోదాలకు పూనుకోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో అంతకుముందు అన్నారు. ఈ వార్త తెలిసి తాము ఆందోళనకు గురయ్యామన్నారు. ఇది చాలా విచారకరమన్నారు. సోదాల వెనుక ఎవరున్నారో ఆరా తీస్తామన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా స్టాలిన్ నివాసంలో సిబిఐ సోదాలను ఖండించిన విషయం తెలిసిందే. స్టాలిన్ నివాసంలో సోదాలు సరికాదన్నారు. ఇలాంటి సమయంలో సోదాలపై అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. సిబిఐ సోదాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఇది ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు తీసుకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

కాగా, విదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ స్టాలిన్ నివాసంలో సోదాలు జరిపింది. గురువారం తెల్లవారుజాము నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రారంభించింది. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి బంధువుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. అనంతరం విమర్శలు రావడంతో ఆపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+