సంజయ్‌దత్‌కి శిక్ష: కోర్టులోనే ఏడ్చిన సోదరి ప్రియాదత్

సంజయ్ దత్ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధిస్తున్నట్లు చెప్పగానే ఆమె ఒక్కసారిగా ఏడ్చారు. అనంతరం తీర్పుపై స్పందిస్తూ.. తీర్పుతో ప్రతి ఒక్కరు అప్ సెట్ అయ్యారని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుపై ఆమె అభిప్రాయం కోరగా తాను ఇప్పుడు ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. వెంటనే అక్కడు నుండి విషణ్ణ వదనంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె ముంబయి కాంగ్రెసు ఎంపిగా ఉన్నారు.
మరోవైపు సంజయ్ దత్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. తాను సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తానని చెప్పారు. కాగా, సంజయ్ దత్‌కి సుప్రీం కోర్టులో షాక్ తగిలిన విషయం తెలిసిందే. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది.
2006లో టాడా కోర్టు అతనికి ఆరేళ్ల శిక్ష విధించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు టాడా కోర్టు తీర్పును సమర్థించింది. అయితే, అతని శిక్షను ఆరేళ్ల నుండి ఐదేళ్లకు కుదించింది. టాడా కోర్టు తీర్పు అనంతరం సంజయ్ పదహారు నెలల జైలు శిక్ష అనుభవించారు. మరో మూడున్నర నెలల శిక్ష మిగిలి ఉంది. అయితే, దీనిపై సంజయ్ రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications