వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్లు: ఇద్దరికి ఉరి, సంజయ్‌దత్‌కి ఐదేళ్ల జైలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay Dattu - Suprem Court
ముంబయి: 1993 నాటి ముంబయి పేలుళ్ల పైన జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి యాకూబ్, అబ్దుల్ రజాక్ మెమోన్‌లకు ఉరిశిక్షను విధించింది. మరో పదిమందికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన నిందితుల అప్పీలును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ముంబయి బాంబు పేలుళ్లు కుట్రదారులకు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇందులో పాక్ హస్తం కనిపిస్తోందని పేర్కొంది. ఈ కుట్రలో మహారాష్ట్ర పోలీసులు, కస్టమ్స్ అధికారుల పాత్ర ఉందని ఆరోపించింది. ఆయుధాల అక్రమ రవాణాలో వారి పాత్ర ఉందని తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో అధికారులు ఉన్నారన్నారు. కుట్రదారులు ముంబయి నుండి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ వెళ్లారని తెలిపింది.

నిందితులకు పాకిస్తాన్‌లో ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందన్నారు. నిందుతులు స్వేచ్ఛగా వాదనలు వినిపించే అన్ని అవకాశాలను కల్పించామని న్యాయస్థానం తెలిపింది. ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. టైగర్ మెమోన్ తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంది. బాధితులకు న్యాయం జరగాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందే అని పేర్కొంది. కాగా, 2006లో టాడా కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల్లో ఒకరు ఇప్పటికే మృతి చెందాడు.

సంజయ్‌దత్‌కు షాక్

సంజయ్ దత్‌కి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించడంతో మరో మూడున్నరేళ్లు అతను జైల్లో ఉండాల్సి వస్తుంది.

English summary
Supreme Court upholds death sentence of Yakub Memon in 1993 Mumbai blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X