వేటు లిస్టులో శ్రీశైలం: గండ్ర, జగన్ డెకాయిట్: సిపిఐ

ప్రజా సమస్యల పైన చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు. సభా సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన సభ్యులు కోరుకోవడం సరికాదన్నారు. వారిపై చర్యలకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు అనుబంధ సభ్యుడుగా కొనసాగుతున్నారన్నారు. ఆయన పైన కూడా స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
జగన్ ఆధునిక డెకాయిట్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధునిక డెకాయిట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం శోచనీయం అన్నారు. డిఎంకె నేత స్టాలిన్ నివాసంపై సోదాలు సరికాదన్నారు. జగన్ కేసును వేగవంతం చేయాలని కోరారు.
జగన్‌ను అక్రమంగా జైలులో ఉంచారు
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో ఉంచారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు వేరుగా అన్నారు. సిబిఐని కాంగ్రెసు పార్టీ పావులా ఉపయోగించుకుంటోందన్నారు. ఇది సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications