జగన్ ఆదర్శమైతే జేబుదొంగలే, కిరణ్ జాబ్స్‌ చిట్టా: బాబు

Chandrababu Naidu
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే జేబు దొంగలవుతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. జైలుకు వెళ్లే వారు ఆదర్శం కాకూడదన్నారు. జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటే జేబు దొంగలవుతారని విమర్సించారు.

ప్రజా కోర్టులో పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసులను చిత్తు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్, మహాత్మా గాంధీ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మూడేళ్లలో పదిహేను లక్షళ ఉద్యోగాలు అని చెప్పిన ముఖ్యమమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని ఇచ్చారో అందరికీ తెలుసునన్నారు. కిళ్లీ షాపులు, కాఫీ హోటళ్లు, బట్టల కొట్లు మద్యం దుకాణాలు, ప్రైవేట్ కంపెనీల్లో చేరిన వారందరి జాబితా తయారుచేసి వీరందరికి తానే ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

యువతే మనదేశానికి బలమని, అటువంటి శక్తివంతమైన యువత అవినీతిపై పోరాటం చేయాలని సూచించారు. ఒకప్పుడు సమాజాన్ని శాసించిన బ్రాహ్మణులు ఇవాళ అన్ని విధాలుగా వెనుక బడిపోయారని వారికి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు మత గురువు ముసుగులో దోపిడీ చేస్తున్నాడని, బావమరిది ఎర్రచందనం స్మగ్లింగ్, కల్తీ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని ఇటువంటి వారి మాటలు నమ్మితే యువతకు శిక్షణ ఇచ్చి జేబు దొంగలుగా తయారు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఇవాళ యువ నాయకత్వం ఎంతైనా అవసరముందని 33 శాతం సీట్లు యువకులకే ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. పలు బ్రాహ్మణ సంఘాలు కోరుతున్న విధంగా బ్రాహ్మణ నిధి ఏర్పాటు, పూజారుల ఉద్యోగ విరమణ వయస్సు పెంచే విషయం ఆలోచిస్తానని, అగ్రకుల పేద విద్యార్థులందరికి వసతి గృహ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+