ద్రావిడ విశ్వవిద్యాలయం మహిళా ప్రొఫెసర్ల సిగపట్లు

అధికారుల అసమర్థతో లేక అసమంజస కార్యకలాపాలో కానీ వర్గాలుగా విడిపోతున్న ఆచార్యులు, విద్యార్థుల బృందాలు నిత్యం ఘర్షణలకు దిగుతున్నాయి. తాజాగా ఇద్దరు మహిళాఆచార్యులు ఉపకులపతి ఎదుటే సిగపట్లకు దిగారు.
ద్రావిడ విశ్వవిద్యాలయ వార్షికోత్సవం నెల 22న జరిగింది. ఆ సందర్భంగా వివిధ కమిటీలను ప్రొఫెసర్లతో నియమించారు. వార్షికోత్సవం విజయవంతమైనందుకు ఆయా కమిటీలతో సోమవారం సాయంత్రం ఉపకులపతి కె.రత్నయ్య అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగు విభాగానికి చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఉమెన్‌సెల్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సత్యవాణి కార్యక్రమాలకు సంబంధించి తమకు సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆక్షేపించారు.
అదే సమావేశంలో ఉన్న కన్నడ భాషా విభాగానికి చెందిన మరో మహిళా ప్రొఫెసర్ తెలుగు ప్రొఫెసర్‌తో వాగ్వాదానికి దిగారు. వీసీ ఎదుటే ఆ ఇద్దరూ ఘర్షణకు దిగారు. ప్రొఫెసర్ల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరకు సిగపట్లు పట్టుకునే స్థాయికి చేరింది. సమావేశంలో ఉన్న మిగిలినవారితో పాటు వీసీ రత్నయ్య కూడా ఈ వాగ్వాదాన్ని చూస్తుండడం తప్పించి కనీసం వారించడానికి ప్రయత్నం చేయలేకపోయారు.












Click it and Unblock the Notifications