బిజెపి దీక్ష భగ్నం: విజయమ్మకు వైద్య పరీక్షలు

నిమ్స్‌లో కూడా తాను దీక్ష కొనసాగిస్తానని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, శానససభ్యుడు కిషన్ రెడ్డి చెప్పారు. తమను ఆస్పత్రికి తరలించిన తర్వాత కూడా దీక్ష కొనసాగుతుందని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రకటన వెలువడిన వెంటనే ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బిజెపి శాసనసభ్యులు నిరాహార దీక్షకు దిగారు.
విజయమ్మకు వైద్య పరీక్షలు
ఇదిలావుంటే, విద్యుత్ సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలువైయస్ విజయమ్మకు మంగళవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైయస్ విజయమ్మ మంగళవారం ఉదయం 11 గంటలలకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.
విజయమ్మ దీక్షకు రాఘవులు మద్దతు
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సిపిఎం మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ఈ నెల 9వ తేదీన తాము తలపెట్టిన బంద్‌కు సహకరించాలని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్ని పార్టీలను కోరారు. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
చార్జీల పెంపుపై విచారణ 8కి వాయిదా
విద్యుత్ చార్జీల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజానాల వ్యాజ్యాన్ని (పిల్‌ని) హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. చార్జీల పెంపునకు గల కారణాలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా ఈఆర్‌సిని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 8వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎపి ట్రాన్స్‌కోను, మరో నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు.












Click it and Unblock the Notifications