ధర్నా: రేణుకా చౌదరి నాలుక కోస్తామని హెచ్చరిక

హైదరాబాదులోని రేణుకా చౌదరి నివాసం ముందు అమరవీరుల కుటుంబ సభ్యులు బుధవారం ధర్నా చేశారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. అమరవీరులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు రేణుకా చౌదరిని డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు రేణుకా చౌదరి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పులతో, చీపుర్లతో తగిన శాస్తి చేస్తామని వారన్నారు.
కాంగ్రెసు నాయకులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, రేణుకా చౌదరిలకు తెలంగాణ అమరులపై మాట్లాడే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. తెలంగాణ అమర వీరులను కించపరిస్తే సహించేది లేదని ఆయన బుధవారంనాడు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మరణించినవారంతా ఆత్మబలిదానాలు చేసుకోలేదని, రోగాలు వచ్ిచ మరణించారని రేణుకా చౌదరి సోమవారంనాడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు కూడా తప్పు పడుతున్నారు. రేణుకా చౌదిరిది తెలంగాణ కాదని, ఆంధ్రప్రాంతమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications