అదే వైయస్ చేసిన తప్పా?: విజయమ్మ కంట నీరు

విద్యుత్ ఛార్జీలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తగ్గించే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. విద్యుత్ కష్టాలకు వైయస్ కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం విడ్డూరమన్నారు. ఆయన ఎలా కారణమవుతారని ఆమె ప్రశ్నించారు. జెన్ కోను పటిష్ట పర్చింది, పరిశ్రమలకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వైయస్సే అన్నారు. ఏ రంగానికి ఆయన తన హయాంలో పవర్ హాలీడే ఇవ్వలేదని చెప్పారు.
ఉచిత విద్యుత్ ఇవ్వడమే వైయస్ చేసిన తప్పా అన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని ఆరోపించారు. ఆయన తన హయాంలో ప్రయివేటు సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం హయాంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, ఛార్జీలతో ప్రజలపై భారీగా భారం పడుతుందన్నారు. కాగా విజయమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కళాకారులు పాటలు పాడినప్పుడు విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు వైయస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. బాబు చరిత్ర ఏమిటో చిత్తూరు ప్రజలకు తెలుసునన్నారు. రెండు ఎకరాల ఆసామీ ఇప్పుడు కోట్లాది రూపాయలు ఎలా సంపాదించుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వాన్ని బాబు కాపాడుతున్నారన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత బాబుదే అన్నారు.
కిరణ్‌ను అడ్డుకున్న వైయస్సార్ కాంగ్రెసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ బుధవారం అడ్డగించింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వారు అడ్డుకున్నారు. పోలీసులు కోటంరెడ్డి సహా పలువురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications