బెజవాడ టిడిపిలో 'నెహ్రూ' ట్విస్ట్: వంశీ మాట గద్దె నోట!

అదే సమయంలో ఆయన కొత్త వివాదానికి తెరదీశారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పైన ఆయన సోదరుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నెహ్రూ పైన పోటీ చేసేందుకు ఆయన సోదరుడే సరైన అభ్యర్థి అని చెప్పారు.
ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని గద్దె రామ్మోహన రావు చెప్పారు. గతంలో పార్టీ నేత వల్లభనేని వంశీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూ పైన ఆయన సోదరుడు ఉమామహేశ్వర రావు పోటీ చేయాలన్నారు. ఇప్పుడు గద్దె అదే డిమాండును తెరపైకి తీసుకు వచ్చారు.
కాగా, గద్దె రామ్మోహన రావు 1994లో గన్నవరం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. అదే టిక్కెట్ పైన హామీ ఇచ్చి చంద్రబాబు అతనిని పార్టీలోకి తీసుకు వచ్చినా సమీకరణాలు కుదరకపోవడం వల్ల 1999లో గన్నవరం కాకుండా విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. 2004లో గద్దె విజయవాడ ఎంపి టిక్కెట్ ఆశించినా చిరంజీవి ప్రచారం చేస్తారని చెప్పి దానిని నిర్మాత అశ్వనీదత్‌కు ఇచ్చారట. గద్దెను మాత్రం కంకిపాడుకు పంపించారు. 2009లో గద్దె మరోసారి ఎంపి టిక్కెట్ ఆశించినా అది వల్లభనేని వంశీకి ఇచ్చారు. గద్దెను విజయవాడ తూర్పుకు పంపించారు. ఇప్పుడు ఆయన విజయవాడ ఎంపీ టిక్కెట్ తప్ప ససేమీరా అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications