ఆ ఆలోచన మానాలి: కెసిఆర్‌కు యాష్కీ, కెవిపిపై ఫైర్

ముందస్తు ఎన్నికలతో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయని కెసిఆర్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ భవిష్యత్తులో ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెసు, టిడిపిని బొంద పెట్టాలంటే వచ్చే ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కెసిఆర్ వెళతారా ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న జగన్ పార్టీతో ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
తెరాస కాంగ్రెసు పార్టీలో విలీనం అయితే తెలంగాణ ఖాయమన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో తెలంగాణపై ప్రకటన రావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలతో తెలంగాణ రాదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు శకుని పాత్ర పోషిస్తున్నారి ధ్వజమెత్తారు.
ఆరోగ్యశ్రీ ఆపొద్దు.. అంబటి
ఆరోగ్యశ్రీని అటకెక్కించే ప్రయత్నం చేయవద్దని, అలా చేస్తే ప్రజలు సహించరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం అన్నారు. పేదలకు వైద్యాన్ని దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నామని ప్రయివేటు ఆసుపత్రులు చేసిన ప్రకటనపై మంత్రులు స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రభుత్వం పంతానికి పోయి ఆరోగ్యశ్రీని కొనసాగించకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!