వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంకలో తమిళ పత్రిక ఆఫీస్‌పై దాడి: జవాన్ కళ్లు ఛిద్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Attack on Tamil paper office in Sri Lanka
కొలంబో/శ్రీనగర్/కోల్‌కతా: తమిళనాడులో శ్రీలంకపై నిరసనల నేపథ్యంలో ఆ దేశంలో ఓ తమిళ పత్రిక పంపిణీ కార్యాలయం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బుధవారం ఈ ఘటన ఉత్తర శ్రీలంకలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పత్రికకు చెందిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.

కిలినోచ్చిలో ఉన్న ఉదయమన్ పత్రిక పంపిణీ కార్యాలయం పైన ముసుగు ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని పత్రిక ప్రుచురణ కర్త ఇ.శరవనపవన్ తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో దుండగులు కార్యాలయంలోకి వచ్చారు.

పత్రికా సిబ్బందిని అవమానించారు. అనంతరం దాడికి పాల్పడ్డారు. ఉదయన్ పత్రిక శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న తమిళుల కోసం తమిళ భాషలో పత్రికను ముద్రిస్తోంది. ఈ పత్రిక తమిళ టైగర్స్ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోంది.

జమ్ము-కాశ్మీర్‌లో జవాన్ కళ్లు ఛిద్రం

జమ్మూ కాశ్మీరులో జమ్మూ పూంఛ్ రహదారి పైన అఖ్నూర్ వద్ద రెండు కళ్లు పెకిలించడంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సైనికుడిని గుర్తించారు. రాకేష్ దత్ అనే జవానుకు రెండు కళ్లు పెకిలించడంతో, అపస్మారక స్థితిలో ఒఖ నాలా వద్ద పడి ఉండగా బుధవారం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

జవానును ఆసుపత్రిలో చేర్పించారు. కళ్లు దెబ్బతినడానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాఫ్తు చేస్తామన్నారు. సరిహద్దు జిల్లా రాజౌరిలో ల్యాంకు చెందిన రాకేశ్ దత్ 11 రాష్ట్రీయ రైఫిల్స్ దళంలో జవాను. నెల రోజులుగా సెలవులపై ఉన్నారు. ఆయన సెలవులు మార్చి 31వ తేదిన ముగిశాయి.

ఎస్ఎఫ్ఐ నేత మృతిపై ఫైర్

ఎస్ఎఫ్ఐ నేత అనుమానాస్పద మృతితో బెంగాల్ భగ్గుమంది. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు కోల్‌కతాలోని రాణి రస్మోని రోడ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకొని.. కోర్టు ఆదేశాల మేరకు వారిలో కొందరిని ప్రెసిడెన్సీ జైలుకు బస్సులో తరలించారు.

రవీంద్ర భారతి యూనివర్సిటీలో చదువుతున్న ఎస్ఎఫ్ఐ నేత సుదీప్తో గుప్తా కూడా వీరిలో ఉన్నారు. గుప్తా ఒక్కసారిగా బస్సులోంచి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు కస్టడీలోనే గుప్తా మృతి చెందాడని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. ఎస్ఎస్‌కేఎమ్ ఆస్పత్రికి వెళ్లి గుప్తా కుటుంబాన్ని పరామర్శించారు. అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ సహాయం తమకు అక్కర్లేదని గుప్తా తండ్రి ప్రణబ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఆయన కూడా లాఠీ దెబ్బలవల్లే తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

English summary

 A group of unidentified men attacked the office of a Tamil newspaper in Sri Lanka's former war zone on Wednesday, injuring several staffers and damaging equipment at the publication known for its government criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X