వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

72కు చేరిన మృతులు: 9 ఏళ్ల చిన్నారి సురక్షితం

By Pratap
|
Google Oneindia TeluguNews

Thane
ముంబై: మహారాష్ట్రలోని ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 72కు చేరింది. థానేలో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం గురువారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. కాగా, అశ్చర్యకంగా ప్రమాదం నుంచి 9 ఏళ్ల బాలిక సురక్షితంగా బయటపడింది. ఆమెను కాల్వాలోని ఛత్రపతి శివాజీ ఆస్పత్రిలో చేర్చారు. ఆ చిన్నారి ఎవరో కూతురో తెలియడం లేదు. ఆమెను తీసుకుని వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు.

చిన్నారి తల్లిదండ్రులు భవనం శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ బాలిక సంరక్షణ బాధ్యతలను ఆస్పత్రి సిబ్బందే భుజాన వేసుకున్నారు. ఆ చిన్నారికి స్నానం చేయిస్తున్నారు. ప్రేమను పంచుతున్నారు. కడుపు నింపుతున్నారు. తల్లిదండ్రులతో కలపగలిగితే బాగుండునని ఆస్పత్రి సిబ్బంది తాపత్రయపడుతున్నారు. స్థానిక వాలంటీర్లు ఆమె తల్లిదండ్రులను కనిపెట్టే పనిలో పడ్డారు.

ధానే భవనం కూలిన సంఘటనలోని క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 12 అగ్నిమాపక శకటాలు, 26 అంబులెన్సులతో ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఈ భవంతికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పారు.

భవన నిర్మాణానికి స్థానిక అధికారులకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసాఫీసర్ దిగంబర్ చెప్పారు. మొదటి నాలుగు అంతస్తులలో ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. నాలుగు అంతస్తుల్లో పలువురు ఉంటున్నారని, తదుపరు మూడు అంతస్తులు కూడా కూలే సమయానికి పూర్తయ్యాయని, మరో అంతస్తు కోసం కూలీలు పని చేస్తున్నారని చెబుతున్నారు. దాదాపు 28 కుటుంబాలు భవనంలో అప్పటికే నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Of the several survivors pulled out of the collapsed Mumbra building and admitted to the Chhatrapati Shivaji Hospital in Kalwa, one has become the cynosure of the staff's eyes. The staff dotes over the lucky nine-month-old girl, feeds her and puts her to sleep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X