వైయస్ హయాంలో...: కెవిపిపై సూరీడు చెప్పిన నిజం!

డీల్ విషయంలో ఏ పార్టీ వచ్చిన మొదట కెవిపిని కలవాల్సిందేనని, ఆ తర్వాత ఆయనే వారిని నాటి ముఖ్యమంత్రి వైయస్ వద్దకు తీసుకు వెళ్లేవారని చెప్పారట. ఒకవేళ పారిశ్రామికవేత్తలు ఎవరైనా నేరుగా వైయస్‌ను కలిస్తే ఆయన మొదట కెవిపిని కలవమని స్వయంగా చెప్పే వారని సూరీడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక వ్యక్తి స్టేట్‌మెంటును బట్టి ఒకరిపై నిందితుడిగా పేర్కొనలేమని సిబిఐ కోర్టుకు నిన్న తెలిపింది.
కెవిపి రామచంద్ర రావుకు వ్యతిరేకంగా ఇతర ఆధారాలు, సాక్ష్యాలు ఎలాంటివి దొరకలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కెవిపిని నిందితుడిగా ఛార్జీషీట్లలలో పేర్కొనలేదంటున్నారు. అయితే, కెవిపికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంపై మాత్రం సిబిఐ దృష్టి సారించింది. కోర్టు కూడా కెవిపి రామచంద్ర రావును నిందితుడిగా చేర్చే అంశం పైన సిబిఐని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications