వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక జోష్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలోకి దిగడానికి అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లీస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. బీదర్, బసవకల్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న మజ్లీస్ శానససభ ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బీదర్ (టౌన్), బీదర్ సౌత్, బసవకల్యాణ్ శాసనసభ స్థానాలపై మజ్లీస్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లీస్ బీదర్, బసవకల్యాన్‌ల్లో మూడేసి వార్డులను గెలుచుకుంది. శాసనసభ ఎన్నికల్లో కూడా తాము బలాన్ని చాటుకుంటామని మజ్లీస్ సీనియర్ నేతలు అంటున్నారు. పార్టీని విస్తరించే వ్యూహంలో భాగంగా ముస్లింల జనాభా అధికంగా ఉన్న బీదర్, బసవకల్యాణ్‌ల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు మజ్లీస్ నాయకులు చెబుతున్నారు.

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి కర్ణాటక ఎన్నికల్లో పోటీ ఉపయోగపడుతుందని మజ్లీస్ నాయకులు భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 17. అయితే, మజ్లీస్ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. మజ్లీస్ బహుముఖ పోటీలో ఇతర పార్టీలతో తలపడాల్సి ఉంటుంది.

బిజెపి, యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ (కెజెపి), బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), కాంగ్రెసు, జెడి (ఎస్), బి. శ్రీరాములు బదవ శ్రామిక రైత (బిఎస్సార్), మక్కర్ పక్ష పార్టీలతో మజ్లీస్ పోటీ పడాల్సి ఉంటుంది. మజ్లీస్ పోటీ వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయి, ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ముస్లిం అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. బీదర్ రూరల్, ఇతర సెగ్మెంట్లలో పోటీ చేద్దామని నాయకులు తనను అడుగుతున్నారని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు. అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

English summary
The Majlis-e-Ittehadul Muslimeen (MIM) has decided to field candidates in the upcoming Karnataka assembly elections to test the electoral waters in the neighbouring state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X