IPL 2026: లక్నో కెప్టెన్ మార్పు ? పంత్ స్ధానంలో ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants). ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి ఆరు మ్యాచ్ లు ఓడిపోయిన లక్నో టీమ్ పై ఇప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ప్లేఆఫ్ గురించి ఆలోచించకుండా ఇంటి ముఖం పట్టడానికి రెడీగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ పై ఫ్యాన్స్ లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రిషభ్ పంత్ కెప్టెన్సీ (Rishabh Pant) కి ముప్పు పొంచి ఉంది.

IPL 2026: ముంబై, సీఎస్కే ఔట్.. ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే!
IPL 2026: ముంబై, సీఎస్కే ఔట్.. ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే!

తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన నేపథ్యంలో, లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యానికి రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతను సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (Aiden Markram) కు అప్పగించాలని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సలహా ఇచ్చాడు. జట్టు తలరాతను మార్చేందుకే పంత్‌ను రూ.27 కోట్లకు తీసుకువచ్చారు. అయితే ఏకానా స్టేడియంలో ఎల్‌ఎస్‌జి వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోవడంతో.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అభిమానులలో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో, దక్షిణాఫ్రికా టీ20ఐ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మార్క్రమ్‌కు పగ్గాలు అప్పగించడానికి ఇదే సరైన సమయం అని జాఫర్ అన్నాడు.

IPL 2026 Sack Rishabh Pant Give Markram the LSG Captaincy Ex-India Star Makes Bold Demand
IPL 2026: రోహిత్ శర్మ రీఎంట్రీ ఖరారు-ఆ మ్యాచ్ కోసం సన్నాహాలు..!
IPL 2026: రోహిత్ శర్మ రీఎంట్రీ ఖరారు-ఆ మ్యాచ్ కోసం సన్నాహాలు..!

బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పు చేయాలని జాఫర్ సూచించాడు. ఒకవేళ తాను ఆ డగౌట్‌లో ఉంటే, చేసే మొదటి పని మార్ క్రమ్ ను కెప్టెన్‌గా చేయడం అన్నాడు.మార్క్రమ్, మిచెల్ మార్ష్‌లతో ఓపెనింగ్ చేయించి, మూడో స్థానంలో నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో రిషబ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని, ఆరో స్ధానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిని పంపుతానన్నాడు. పంత్‌పై ఎలాంటి అదనపు బాధ్యతలు మోపకుండా, అతడిని జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా ఉంచాలని జాఫర్ సూచించాడు. మార్ క్రమ్ ఓ మంచి కెప్టెన్ అని తాను భావిస్తున్నానని, అతను దక్షిణాఫ్రికాకు చాలా విజయవంతంగా నాయకత్వం వహించాడని గుర్తుచేశాడు. అతను మానసికంగా దృఢంగా, చాలా నిలకడగా ఉంటాడని, ఇతర ఆటగాళ్ల నుండి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టగలడని అనుకుంటున్నానని జాఫర్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+