సెంటిమెంట్‌కి దగ్గరపడింది: జగన్, కెసిఆర్‌లకు రేవంత్

శవాలు, సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసిన వారికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నాడు వ్యతిరేకంగా పని చేసిన వారే ఇప్పుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని విమర్శించారు.
ఉరేసుకుంటానే కానీ.. మోత్కుపల్లి
అవినీతితో వైయస్ జగన్, ఉద్యమం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తాను తెరాసలో చేరుతున్నాననేది అబద్దపు ప్రచారమన్నారు. ఆ పార్టీలో చేరడం కన్నా ఉరేసకోవడం మేలన్నారు. దళితులను ముఖ్యమంత్రిగా చేస్తానన్న కెసిఆర్... గద్దర్ లేదా విమలక్క పేరు ప్రకటించగలరా అని ప్రశ్నించారు.
వసూల్ రాజా అని సూరీడే చెప్పారు... చంద్రబాబు
కెవిపి రామచంద్ర రావు వసూల్ రాజా అని సూరీడే చెప్పారని విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దొంగలు, క్రిమినల్స్ చంచల్‌గూడ జైళులో చేరారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రాణాలు పోయినా భయపడనని చెప్పారు.












Click it and Unblock the Notifications