జగన్ భేటీలపై విచారణ జరిపించండి: శోభా నాగిరెడ్డి

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, అధికారం కాంగ్రెసు చేతుల్లోనే ఉందని, నిబంధనలను విరుద్ధంగా ములాఖత్‌లు ఉన్నాయంటున్నారు కదా, మీరే విచారణ జరిపించండని ఆయన అన్నారు. మంగళవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ అధికారి పార్టీ చీఫ్ విప్ ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. జగన్‌ను కుటుంబ సభ్యులు కలిసినా కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ఓర్వలేకపోతున్నారని ఆమె అన్నారు.
జగన్ జైలులో ఉన్నా కట్టడి చేయలేకున్నామనే అక్కసుతో ములాఖత్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. జగన్‌కు జైలు నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శోభా నాగిరెడ్డి స్పందించారు.












Click it and Unblock the Notifications