మార్పు తప్పదు- తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల పైనా స్పష్టత ఇచ్చారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. భవిష్యత్తులో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, కార్యకర్తల కృషి వల్లే పార్టీ విజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. మంత్రాలయంలో పార్టీ కేడర్ తో సమావేశమైన చంద్రబాబు కీలక సూచనలు చేసారు. మంత్రాలయం నియోజకవర్గంలో వర్గ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం సూచించారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు ఉండకూడదని, అందరూ ఒకే జెండా కింద పనిచేయాలని స్పష్టం చేశారు.

నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
cm-chandra-babu-made-key-directions-over-local-body-elections-to-the-party-cadre-in-mantralayam

స్థానిక ఎన్నికల పైనా క్లారిటీ

మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డికి పూర్తి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు, తిక్కారెడ్డి సేవలను పార్టీ రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇద్దరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.2029 ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నెరవేర్చిన ఎన్నికల హామీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాయకులను పక్కనపెట్టి కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+