టిటిడిపిలో ముసలం: మోత్కుపల్లి చీడపురుగని కడియం

ఈ నెల 19న జరిగిన టిడిపి ఫోరం అంతర్గత సమావేశంలో పార్టీ పటిష్టత కోసం తెలంగాణ ఉద్యమంపై తాను సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై తాను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశానని, పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించాననే వార్తలు పత్రికల్లో మరుసటి రోజు రావడం పట్ల తానేదో తప్పు చేసినట్లు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. తనపై ఆరోపణలు చేసిన నేత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కడియం డిమాండ్ చేశారు.
అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీలో మనుగడ సాగిస్తున్న చీడ పురుగులెవరో కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు తెలుసునని కడియం ధ్వజమెత్తారు. పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి వచ్చిన సదరు నేతలకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. పార్టీలో తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, ఈ కోల్డ్ వార్ తెలంగాణ ప్రాంత నేతల మధ్య కొనసాగడం దురదృష్టకరమన్నారు.












Click it and Unblock the Notifications