సోనియా గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

కెసిఆర్‌పై టిడిపి మండిపాటు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం న్యూఢిల్లీలో మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు, హోదా లేవని నామా నాగేశ్వర రావు అన్నారు.
కెసిఆర్‌కు పార్లమెంటులో పనేమీ లేదన్నారు. అందుకే తెలంగాణ గురించి పార్లమెంటులో ఏమీ మాట్లాడరన్నారు. ఆయన ఎంపీగా ఉండటం వల్ల ఎవరికీ లాభం లేదన్నారు. గతంలో ముడుపులు ముట్టడం వల్లనే ఆయన బయ్యారం గనులపై మాట్లాడలేదని ఆరోపించారు.
కెసిఆర్ ఫాం హౌస్ రాజకీయాలు నెరపుతున్నారని మరో ఎంపి రమేష్ రాథోడ్ అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కెసిఆరే కారణమన్నారు. తెలంగాణ ప్రాంతంలో కెసిఆర్‌ను 80 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కెసిఆర్ తన కుటుంబం కోసం తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారని గుండు సుధారాణి ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లే ప్రాంతీయ విభేదాలని సుజనా చౌదరి విమర్శించారు.












Click it and Unblock the Notifications