చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మాట వినేది లేదు!, క్లిష్ట పరిస్థితుల్లో..: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమ్మహస్తం పథకం దండుగ అని, వద్దని చెబుతున్నారని కానీ ప్రజలు మాత్రం అది కావాలంటున్నారని, తాను ఆయన మాట వినని, ప్రజల మాటే వింటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. కిరణ్ చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

తన సొంత నియోజకవర్గం పీలేరు, తంబళ్లపల్లిలు తనకు వేర్వేరు కాదన్నారు. తన సొంత నియోజకవర్గంలాగే అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొందరు పార్టీని అస్థిరపర్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ఎదిరిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీని సమష్టిగా ముందుకు తీసుకు వెళ్లవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇందిరా గాంధీ కలలు గన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను దేశంలో మొదట అమలు చేసింది మన రాష్ట్రంలోనే అన్నారు.

చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించినా సొంత జిల్లా చిత్తూరుకు ఏమీ చేయలేదన్నారు. బిసిలకు ఏదో చేశానని చెబుతున్న బాబు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకొని పోతామన్నారు.

తాను క్లిష్ట సమయాల్లో ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదలకు విద్యుత్ భారం వేయలేదన్నారు. యాభై యూనిట్ల వరకు కాలిస్తే ఆ బిల్లును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలో సోలార్ పవర్ విద్యుత్‌కు చర్యలు చేపడతామన్నారు.

English summary
CM Kiran Kumar Reddy has blamed Telugudesam Party chief Nara Chandrababu Naidu over Amma Hastham scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X