అనుమతి అవసరం లేదు: ధర్మానపై సిబిఐ

Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంపై దాఖలైన చార్జిషీట్ మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను వాదించారు. నిందితుడిగా తన పేరును సిబిఐ చార్జిషీట్‌లో చేర్చడాన్ని సవాల్ చేస్తూ ధర్మాన ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కింది కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధర్మాన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను ఆరోపించరాు. వాన్‌పిక్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని, ఆ సంస్థకు భూములు కేటాయించడంలో ధర్మాన పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆయన వాదించారు.

వాన్‌పిక్‌కు అనుకూలంగా ధర్మాన ప్రసాద రావు 2004 - 2009 మధ్య కాలంలో వ్యవహరించారని, భూములను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ఆయన అన్నారు. శాసనసభకు బాధ్యతగా ఉండాల్సిన మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ న్యాయవాది అన్నారు.

సిబిఐ న్యాయవాది వాదనలను కొట్టేయడానికి ధర్మాన ప్రసాద రావు తరఫు న్యాయవాది ప్రయత్నించారు. మంత్రివర్గం ఆమోదంతోనే జీవోలు జారీ అయ్యాయని ఆయన అన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద ప్రభుత్వ అనుమతి లేకుండా ధర్మానను ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌కు భూములు కట్టబెట్టడంలో అక్రమాలు జరిగాయని అభియోగాలు మోపుతూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో ధర్మానను సిబిఐ ఐదో నిందితుడిగా చేర్చింది. ప్రస్తుతం రోడ్లు భవనాల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+