ఎమ్మెల్యేల్ని జగన్ వైపు లగడపాటి పంపించారు: టిఎంపి

లగడపాటి ఇక చిలక జోస్యం చెప్పుకోవాలన్నారు. తెలంగాణ ఇస్తానని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని రాజయ్య చెప్పారు. 2014లోగా తెలంగామ ఇస్తామని సోనియా తమకు చెప్పారన్నారు. కాంగ్రెసు పార్టీ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
జగన్ వల్లే వైయస్ ఆబాసుపాలు.. గండ్ర
బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు కేటాయించడంలో తప్పు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బయ్యారం గనులు విశాఖ స్టీల్స్‌కు కేటాయించినప్పటికీ బయ్యారంలో మాత్రం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అబాసుపాలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కష్టాలు తప్పువు.. బొత్స
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు కొంతకాలం పాటు విద్యుత్ కష్టాలు భరించాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లా గరివిడి మండలం గొండపల్లిలో పిహెచ్‌సిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications