ఆత్మీయ సమావేశం: భువనేశ్వరి, బాబు వడ్డించారు

సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తలకు, సిబ్బందికి స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి భోజనాలు వడ్డించారు. కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫొటోలు దిగారు. పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసిన
వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
అంతకు ముందు విశాఖపట్నం జిల్లాలోని పెద్దగొల్లపాలెం వద్ద బస చేసిన చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేష్, భార్య భువనేశ్వరి కలిశారు. ఆ తర్వాత పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన్ రావు చంద్రబాబుతో సమావేశమై శనివారం జరిగే పాదయాత్ర
ముగింపు సభ ఏర్పాట్లను సమీక్షించారు.
అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర గురువారం నాటికి 2,800 కి.మీ పూర్తి చేసుకుంది. 16 జిల్లాలు 84 నియోజకవర్గాలు 160 మండలాలు, 1246 గ్రామాలను 206 రోజులుగా పాదయాత్రలో చంద్రబాబు చుట్టారు. శనివారం
విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగియనుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది లక్షల మంది వరకు విశాఖ బహిరంగ సభకు రావచ్చని ఆ పార్టీ నేతల అంచనా.












Click it and Unblock the Notifications