వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట తప్పం మడప తిప్పం!: జగన్ వైయస్‌లా కాదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల పార్టీలోని పరిణామాలు చూస్తున్నవారు నిజమేనంటున్నారు. సీమాంధ్రలోని పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. తెలంగాణ జిల్లాల్లోని నేతల్లో అంతకంటే ఎక్కువ అసంతృప్తి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్య నేత అయిన కొండా సురేఖ అసంతృప్తి కారణంగా దూరంగా ఉంటున్నారనే వాదన కొద్దికాలంగా ఉంది. అన్ని జిల్లాల్లోని నేతల పరిస్థితి ఇలాగే ఉందట. సమన్వయకర్తల నియామకం వల్లనే జగన్ పార్టీలో అసంతృప్తుల బెడద ఎక్కువయిందంటున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా, బయట అధిష్ఠానం పెద్దలుగా చలామణి అవుతున్నవారి పోకడలతో తెలంగాణలోని చాలామంది నేతలు రగిలిపోతున్నారట.

నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం మొదలు, పార్టీ ఈ ప్రాంతంలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన వరకు ఎందులోనూ తమ భాగస్వామ్యం లేకపోవడాన్ని కొందరు అవమానంగా భావిస్తున్నారట. డబ్బున్న వారికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రజల్లో బలంగా ఉన్నవారినీ పక్కన పెడుతున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయట. జగన్ పార్టీలో చేరి తప్పు చేశామని, గోతిలో పడ్డామని ఆవేదన చెందుతున్నారట.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాట ఇస్తే కాదనకపోయేవాడని, జగన్ మాత్రం అలా కాదని సొంత పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. వైయస్‌లా జగన్ కాదనే విషయం తెలియక బోల్తా పడ్డామని ఆవేదన చెందుతున్నారట. మొదటి నుండి పార్టీలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యం లేదని ఆందోళన చెందుతున్నారట. అందుకే పలువురు నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదంటున్నారు. కొందరు నేతలకు మొదటి నుండి టిక్కెట్ పైన హామీ ఇచ్చి ఆ తర్వాత నాన్ లోకల్ అంటూ పక్కన పెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రకాశం జిల్లా అద్దంకిలా ఈ సమస్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

జగన్ కోసం మంత్రి పదవి వదులుకున్న కొండా సురేఖ, పార్టీ దక్షిణ తెలంగాణ ఇన్‌చార్జి జిట్టా బాలకృష్ణా రెడ్డి, బాజిరెడ్డి, అజయ్‌లు సైలెంటయిపోయారంటున్నారు. మరోవైపు షర్మిల యాత్ర నుంచి విజయమ్మ రచ్చబండ దాకా తెలంగాణలో షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం నుంచి ఈనెల 27న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విజయమ్మ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వరకు ఏదీ ఇక్కడి నేతలకు ముందస్తు సమాచారం లేదని, అందుకే దూరంగా ఉండాలని ఈ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు భావిస్తున్నారట.

English summary
It is said that Telangana YSR Congress leaders are unhappy with Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X